పంజాబ్ లోనీ అమృత్ సార్ శివసేన పార్టీ నేత సుధీర్ సూరిని ఓ దుండగుడు హత్య చేశాడు. అమృత్ సార్ నగరంలోని ఓ దేవాలయం ఎదుట ధర్నా చేస్తుండగా.. గుంపులో వచ్చిన నిందితుడు తుపాకీతో షూట్ చేశాడు.
ఆంజనేయులు న్యూస్, పంజాబ్: లోనీ అమృత్ సార్ శివసేన పార్టీ నేత సుధీర్ సూరిని ఓ దుండగుడు హత్య చేశాడు. అమృత్సర్ నగరంలోని ఓ దేవాలయం ఎదుట ధర్నా చేస్తుండగా. గుంపులో నుంచి వచ్చిన నిందితుడు తుపాకీతో షూట్ చేశాడు. ఈ ఘటనలో సూరి అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. ఆలయ ప్రాంగణం వెలుపల చెత్తకుప్పలో కొన్ని విగ్రహాల శకలాలు కనిపించగా.. ఆలయ అధికారులకు వ్యతిరేకంగా శివసేన నాయకులు నిరసనకు దిగారు. ఈ క్రమంలోనే ఈ ఘటన చోటు చేసుకుంది. సూరిని షూట్ చేసిన తర్వాత దుండగుడు గాల్లోకి కాల్పులు జరుపుతూ అక్కడి నుంచి పారిపోయినట్లు ప్రత్యక్షసాక్షులు చెబుతున్నారు.
మరోవైపు సూరి పోలీసు అధికారితో మాట్లాడుతుండగానే ఈ ఘటన చోటు చేసుకోవడం గమనార్హం. అమృత్సర్ పోలీసులు నిందితుడిని అరెస్టు చేసినట్లు తెలుస్తోంది. సుధీర్ సూరికి ప్రాణాపాయం ఉందన్న సమాచారంతో పోలీసులు అతడికి భారీ భద్రత కల్పించినట్లు సమాచారం. దీనిపై భాజపా నేత తజీందర్ సింగ్ స్పందించారు. ఆమ్ ఆద్మీ పార్టీ వైఫల్యం వల్లే హత్య జరిగిందని విమర్శించారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని ఆరోపించారు. ఘటనకు సంబంధించిన వీడియోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారాయి.
{"type":"video","tracklist":true,"tracknumbers":true,"images":true,"artists":true,"tracks":[{"src":"https://www.anjaneyulunews.com/wp-content/uploads/2022/11/unnamed-file.mp4","type":"video/mp4","title":".mp4","caption":"","description":"","meta":{"length_formatted":"0:32"},"dimensions":{"original":{"width":640,"height":352},"resized":{"width":674,"height":371}},"image":{"src":"https://www.anjaneyulunews.com/wp-includes/images/media/video.svg","width":48,"height":64},"thumb":{"src":"https://www.anjaneyulunews.com/wp-includes/images/media/video.svg","width":48,"height":64}}]}