Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 04 November 2022, 10:14 pm Posted by : Anjaneyulu Dega

ఆధార్ అప్డేట్ ద్వారా మరిన్ని ప్రయోజనాలు

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: ఆధార్ కార్డును అప్ డేట్ చేయడం ద్వారా మరింత శక్తివంతంగా మార్చవచ్చని, మరిన్ని ప్రయోజనాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ చాంబర్లో జిల్లా అటవీ అధికారి శివ్ ఆశిష్ సింగ్, మంచిర్యాల, బెల్లంపల్లి రాజన్వ మండల అధికారులు వేణు, శ్యామలాదేవిలతో కలిసి ఆధార్ అప్డేట్ నంబంధిత గోడప్రతులను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ 10 సంవత్సరాల క్రితం పొందిన ఆధార్ కార్డు అప్ డేట్ చేయడం ద్వారా ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాలను పొందడం సులభతరం అవుతుందని తెలిపారు. ఒక దేశం ఒక రేషన్ కార్డు కార్యక్రమం క్రింద లబ్ధిదారులు దేశంలో ఎక్కడి నుంచైనా రేషన్ పొందవచ్చని, బ్యాంకు ఖాతాను తెరవడం సులభం అవుతుందని, మొబైల్ సిమ్ కార్డును పొందవచ్చని, వివిధ స్కాలర్షిప్ పథకాలను పొందేందుకు మెరుగైన సౌలభ్యమని తెలిపారు. దాదాపు 1 వేయి ప్రభుత్వ పథకాలు, కార్యక్రమాల ప్రయోజనాల లబ్ధి పొందవచ్చని, తప్పిపోయిన కుటుంబ సభ్యులను వారి కుటుంబాలతో కలపటం సాధ్యపడుతుందని తెలిపారు. ఆదాయపు పన్ను చెల్లింపు దారులు అయితే ఐ.టి. – రిటర్న్స్ ను సులభంగా ఈ- వెరిఫై చేసుకోవచ్చు అని తెలిపారు.