Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 01 November 2022, 2:30 pm Posted by : Anjaneyulu Dega

మునుగోడు నియోజకవర్గం లో ఉద్రిక్తత

మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. భాజపా అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ప్రసంగిస్తుండగా కొందరు దుండగులు రాయి విసిరారు.

ఆంజనేయులు న్యూస్, చౌటుప్పల్: ఉపఎన్నిక జరుగుతున్న మునుగోడు నియోజకవర్గ పరిధిలోని చౌటుప్పల్ మండలం ఆరెగూడెంలో ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా భాజపా అభ్యర్థి రాజగోపాల్ రెడ్డి ప్రచారంలో భాగంగా రాజగోపాల్ రెడ్డి ప్రసంగిస్తుండగా కొందరు దుండగులు రాళ్లు విసిరారు. దీంతో ఇద్దరు భాజపా కార్యకర్తలకు గాయాలయ్యాయి. నిందితులను పట్టుకోవాలంటూ భాజపా కార్యకర్తలు రోడ్డుపై బైఠాయించారు. అధికార తెరాసకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పోలీసులు వారికి సర్ది చెప్పారు.