Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 31 October 2022, 6:46 pm Posted by : Anjaneyulu Dega

గ్రామపంచాయతీలలో అభివృద్ధి పనులను పకడ్బందీగా నిర్వహించాలి.

గ్రామపంచాయతీల పరిధిలో ఆయా సంబంధిత శాఖలకు కేటాయించిన అభివృద్ధి పనులను ఎలాంటి జాప్యం లేకుండా పకడ్బంధీగా పూర్తి చేయాలి

జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని గ్రామపంచాయతీల పరిధిలో ఆయా సంబంధిత శాఖలకు కేటాయించిన అభివృద్ధి పనులను ఎలాంటి జాప్యం లేకుండా పకడ్బంధీగా పూర్తి చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన నముదాయంలోని జిల్లా అదనపు కలెక్టర్ చాంబర్ నుండి జిల్లా పంచాయతీ, గ్రామీణాభివృద్ధి, డి.ఎల్.పి.ఓ., మండల పరిషత్ అభివృద్ధి అధికారులు, మండల పంచాయతీ అధికారులు, పంచాయతీ కార్యదర్శులతో జూమ్ యాప్ ద్వారా సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ గ్రామపంచాయతీలలో అంతర్గత రహదారులు, నివాస ప్రాంతాలు, మురుగు కాలువలు గ్రామమంతా పరిశుభ్రంగా ఉండే విధంగా పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహించాలని, గ్రామంలో ఎక్కడా చెత్త ఉండకుండా చర్యలు చేపట్టాలని, ప్రతి రోజు ఇండ్ల నుండి తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించి డంపింగ్ యార్డుకు తరలించే విధంగా అధికారులు పర్యవేక్షించాలని, మన ఊరు – మన బడిలో భాగంగా పాఠశాలల్లో చేపట్టిన అభివృద్ధి పనులను త్వరితగతిన పూర్తి చేయాలని తెలిపారు. చలికాలం కావడంతో చలి తీవ్రత అధికమవుతున్న నేపథ్యంలో తీసుకోవలసిన జాగ్రత్తలపై ప్రజలకు అవగాహన కల్పించాలని, త్రాగునీరు, ఆహారం విషయాలపై తగు సూచనలు చేయాలని తెలిపారు. ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో వైద్యాధికారులు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు వైద్య సేవలు అందించాలని తెలిపారు. గ్రామాలలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించి తగు సూచనలు, నలహాలు చేశారు.