జాతీయ లోక్ అదాలత్ ను సద్వినియోగం చేసుకోవాలి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మంచిర్యాల పట్టణంలోని జిల్లా కోర్టులో శనివారం జాతీయ లోక్ అదాలత్ కోఆర్డినేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా జిల్లా న్యాయమూర్తి బి. సత్తయ్య మాట్లాడుతూ జిల్లా కోర్టులో నవంబర్ 12న నిర్వహిస్తున్న జాతీయ లోక్ అదాలత్ ను అందరూ సద్వినియోగం చేసుకోవాలన్నారు. దీర్ఘకాలిక కేసులతో పాటు బ్యాంకు, ఇన్స్యూరెన్స్ కేసులు కూడా లోక్ అదాలత్ లో పరిష్కరించుకోవచ్చని తెలిపారు. పెండింగ్ కేసుల పరిష్కారానికి న్యాయవాదులు, పోలీసులు సహకరించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా మొదటి అదనపు, సెషన్స్ జడ్జి...