తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేలకు ఎర కేసులో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ముగ్గరు నిందితులను రిమాండ్ కు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది.
ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణలో సంచలనం సృష్టించిన ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో హైకోర్టు కీలక తీర్పు వెల్లడించింది. ఈ కేసులో ముగ్గరు నిందితులను రిమాండ్ కు ఉన్నత న్యాయస్థానం అనుమతించింది. నిందితులు వెంటనే సైబరాబాద్ కమిషనర్ స్టీఫెన్ రవీంద్ర ఎదుట లొంగిపోవాలని ఆదేశించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులకు రిమాండ్ విధించేందుకు ఏసీబీ ప్రత్యేక కోర్టు న్యాయమూర్తి నిరాకరించడాన్ని సవాల్ చేస్తూ ఉన్నత న్యాయస్థానంలో సైబరాబాద్ పోలీసులు పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. పోలీసుల పిటిషన్ పై శుక్రవారం విచారణ జరిపిన హైకోర్టు కీలక ఆదేశాలు జారీ చేసింది. ముగ్గురు నిందితులు హైదరాబాద్ విడిచి వెళ్లొద్దని షరతు విధించింది. ఈ పిటిషన్ పై విచారణను ఇవాల్టికి వాయిదా వేసిన ధర్మాసనం.. ఏసీబీ కోర్టు ఉత్తర్వులను కొట్టేస్తూ నిందితుల రిమాండ్ కు అనుమతి ఇచ్చింది.