Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 28 October 2022, 10:29 pm Posted by : Anjaneyulu Dega

యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా బండి సంజయ్ ప్రమాణం

ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో తనకు సంబంధంలేదని లక్ష్మీనరసింహస్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేశారు. సీఎం కేసీఆర్ కూడా ఇదే విధంగా ప్రమాణం చేయాలని కోరారు.

ఆంజనేయులు న్యూస్, యాదాద్రి: తెరాస ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం రోజుకో మలుపు తిరుగుతోంది. ఎమ్మెల్యేలను కొనుగోలు చేసేందుకు జరిగిన వ్యవహారంతో తమకు సంబంధం లేదని భాజపా నేతలు మొదటి నుంచి చెబుతున్నారు. ఈ క్రమంలో భాజపా రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ మరో అడుగు ముందుకేసి.. సీఎం కేసీఆర్ కు సవాల్ విసిరారు. ఎమ్మెల్యేలకు కొనుగోలు వ్యవహారంతో సంబంధంలేదని యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి సాక్షిగా ప్రమాణం చేస్తానని, సీఎం కేసీఆర్ కూడా ప్రమాణం చేయాలని డిమాండ్ చేశారు. ముందుగా ప్రకటించిన విధంగానే ఇవాళ మధ్యాహ్నం మునుగోడు నుంచి కార్యకర్తలతో కలిసి యాదాద్రి చేరుకున్న బండి సంజయ్.. ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంతో తనకు సంబంధంలేదని లక్ష్మీనరసింహస్వామి పాదాల సాక్షిగా ప్రమాణం చేశారు. సీఎం కేసీఆర్ కూడా ఇదే విధంగా ప్రమాణం చేయాలని కోరారు.