Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 27 October 2022, 10:07 pm Posted by : Anjaneyulu Dega

ప్రభుత్వ జూనియర్ కళాశాలలో డీఐఈఓ 50 లక్షలు స్వాహా

ఆంజనేయులు న్యూస్, కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా: డీఐఈఓ జీ. శ్రీధర్ సుమన్ కాగజ్నగర్ ప్రభుత్వ జూనియర్ కాలేజ్ లో నిర్వహించిన గోల్డెన్ జుబ్లీ కార్యక్రమం పేరుతో అవకతవకలకు పాల్పడ్డారని ఆర్టీఐ ఆక్టివిస్ట్ అశ్రఫ్ గురువారం ఒక ప్రకటనలో ఆరోపించారు. గొల్డెన్ జుబ్లీ కార్యక్రమంలో సుమారు 50 లక్షలు స్వాహా చేసారు అని పేర్కొన్నారు. వెరిఫికేషన్ ఆఫ్ రికార్డు అండర్ అసర్టీఐ క్రింద దరఖాస్తు చేసుకోగా వీరు ఉన్నత అధికారుల అనుమతి తీసుకొని రికార్డును చూపిస్తానని పేర్కొన్నారు. వాస్తవంగా చట్టం ప్రకారం ఉన్న అధికారులు అనుమతి తీసుకోవాల్సిన అవసరం లేదు కానీ 50 లక్షల అవినీతి బయటికి వస్తాదని ఉద్దేశంతో ఉద్దేశపూర్వకంగానే డీఐఈఓ సమాచారం ఇవ్వడం లేదు అని ఆశ్రఫ్ ఆరోపించారు.