
మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: సైబర్ నేరాల పట్ల ప్రజలు అవగాహన కలిగి ఉండాలని మంచిర్యాల ఏసీపీ తిరుపతి రెడ్డి సూచించారు. శుక్రవారం సైబర్ నేరాలపై ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహించారు. సైబర్ నేరాలపై ప్రజలకు ఉన్న అపోహలను, సైబర్ నేరాలు నివారణ మార్గాలను, లోన్ యాప్స్ అవగాహన కల్పించారు. సైబర్ నేరస్తులు డబ్బు దోచేస్తే వెంటనే 1930 కు ఫిర్యాదు చేయాలని సూచించారు.ఈ కార్యక్రమంలో టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ అశోక్ కుమార్, మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ పాల్గొన్నారు.