Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 20 October 2022, 1:44 pm Posted by : Anjaneyulu Dega

పోలీస్ కుటుంబాలకు అండగా నిలుస్తాం

గుండెపోటు తో మరణించిన హెడ్ కానిస్టేబుల్ కుటుంబ సభ్యులకు భద్రత చెక్ అందజేసిన

రామగుండం సీపీ. ఎస్ చంద్రశేఖర్ రెడ్డి

ఆంజనేయులు న్యూస్, రామగుండం పోలీస్ కమిషనరేట్: గోదావరిఖని-1 టౌన్ పోలీస్ స్టేషన్ లో హెడ్ కానిస్టేబుల్  గా విధులు నిర్వహిస్తూ ఎ. గోపాల్-1595 గారు గుండెపోటు తో మరణించగా ఆయన భార్య రాధమ్మ, కుమారుడు ప్రశాంత్ గార్లకి భద్రత ఎక్స్గ్రీసీయ 7,99,160 (ఏడు లక్షల పదహారు వేల నూట అరవై రూపాయల) చెక్ ను గురువారం సీపీ కార్యాలయం లో రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి అందజేశారు. ఈ సందర్భంగా మరణించిన కానిస్టేబుల్ కుటుంబ ప్రస్తుత స్థితిగతులను సీపీ అడిగి తెలుసుకోవడంతో పాటు, వారి కుటుంబానికి పోలీస్ శాఖ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ప్రభుత్వపరంగా అందాల్సిన ఇతర బెనిఫిట్లను తక్షణమే అందజేసేవిదంగా చూస్తామని తెలియజేశారు. పోలీస్ సిబ్బంది కుటుంబాల సంక్షేమం పట్ల ప్రత్యేక శ్రద్ధ కనబర్చడం తో పాటు వారి కుటుంబాలకి అండగా ఉంటామని రామగుండం పోలీస్ కమీషనర్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఏ.ఓ నాగమణి గారు, ఇంద్రసేన రెడ్డి, నాగేశ్వర్ రావు సూపరింటెండెంట్స్, సీసీ శ్రావణ్ కుమార్ పాల్గొన్నారు.