Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 18 October 2022, 5:31 pm Posted by : Anjaneyulu Dega

కారు’ను పోలిన గుర్తులు.. తెరాస పిటిషన్ కొట్టివేత

తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస)కు రాష్ట్ర హైకోర్టులో చుక్కెదురైంది. మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు ‘కారు’ను పోలిన గుర్తులను కేటాయించకుండా ఎన్నికల సంఘానికి తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ తెరాస దాఖలు చేసిన పిటిషన్ ను హైకోర్టు కొట్టివేసింది.

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర సమితి (తెరాస) కు హైకోర్టులో చుక్కెదురైంది. మునుగోడు ఉపఎన్నికలో పోటీ చేస్తున్న స్వతంత్ర అభ్యర్థులకు ‘కారు’ను పోలిన గుర్తులు కేటాయించకుండా ఎన్నికల సంఘానికి తగిన ఆదేశాలు ఇవ్వాలంటూ తెరాస దాఖలు చేసిన పిటిషన్ను ఉన్నత న్యాయస్థానం కొట్టివేసింది. ఎన్నికల ప్రక్రియ కొనసాగుతున్నందున ప్రస్తుతం జోక్యం చేసుకోలేమని హైకోర్టు స్పష్టం చేసింది. కారును పోలినట్లుండే కెమెరా, చపాతీ రోలర్, డోలి (పల్లకి), రోడ్ రోలర్, సబ్బు పెట్టె, టీవీ, కుట్టుమిషన్, ఓడ గుర్తులు ఈవీఎంలో స్టాంప్ సైజ్ లో ఒకేలా ఉంటున్నాయని ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసినా స్పందించపోవడంతో తెరాస హైకోర్టును ఆశ్రయించింది.