
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి
ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ వైద్య విధాన పరిషత్, జిల్లా ఆసుపత్రుల ప్రధాన కార్యాలయం పరిధిలోని బెల్లంపల్లి, చెన్నూర్ సామాజిక ఆరోగ్య కేంద్రాలలో ఒప్పంద సేవల పద్దతిన పోస్టులను భర్తీ చేసేందుకు ఈ నెల 20వ తేదీన ఉదయం 10.30 గం||ల నుండి 1 మధ్యాహ్నం 1 గం॥ల వరకు వాక్-ఇన్-ఇంటర్వ్యూ నిర్వహించడం జరుగుతుందని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి ఒక ప్రకటనలో తెలిపారు. బెల్లంపల్లి సామాజిక ఆరోగ్య కేంద్రంలో సివిల్ అసిస్టెంట్ సర్జన్స్ స్పెషలిస్ట్స్ (పిడియాట్రిషియన్-1, గైనకాలజిస్ట్-1, పల్మొనాలజిస్ట్-1), సివిల్ అసిస్టెంట్ సర్జన్ (జి.డి.ఎం.ఓ.) పోస్టులు, చెన్నూర్ సామాజిక ఆరోగ్య కేంద్రంలో మెడికల్ అధికారి పోస్టులను ఒప్పంద పద్ధతిన భర్తీ చేయడం జరుగుతుందని, ఈ అవకాశాన్ని అర్హత గల అభ్యర్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.