Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 15 October 2022, 4:58 pm Posted by : Anjaneyulu Dega

మునుగోడులో మంచిర్యాల ఎమ్మెల్యే విస్తృత ప్రచారం

ఆంజనేయులు న్యూస్: మునుగోడు ఉప ఎన్నికల్లో టిఆర్ఎస్ అభ్యర్థి కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గెలుపుకు మంచిర్యాల ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు విస్తృతంగా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా శనివారం నియోజకవర్గ పరిధిలోని నాంపల్లి మండలం ఫకీర్ పురం గ్రామంలో స్థానిక ప్రజాప్రతినిధులు, నాయకులతో కలసి ఇంటింటి ప్రచారం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలను వివరించి మునుగోడు అభివృద్ధికి టిఆర్ఎస్ ను గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు నడిపెల్లి విజిత్ కుమార్, తదితరులు పాల్గొన్నారు.