Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 15 October 2022, 3:05 pm Posted by : Anjaneyulu Dega

మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించిన: డీఈఓ వెంకటేశ్వర్లు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని బాలుర ఉన్నత పాఠశాలలో శనివారం జిల్లా విద్యాశాఖ అధికారి ఎస్. వెంకటేశ్వర్లు మధ్యాహ్న భోజన అమలు విధానాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. శనివారం రోజు అందించిన వెజిటేబుల్ పలావుని, ఆలు గడ్డ టమాట కూరను డి.ఈ.ఓ గారు స్వయంగా పరిశీలించి మధ్యాహ్న భోజనం తయారీ ఏజెన్సీ నిర్వాహకులు పుష్పలతతో  మాట్లాడి తయారు విధానం అడిగి తెలుసుకున్నారు. అనంతరం పలువురు విద్యార్థులకు స్వయంగా భోజనం వడ్డించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు విద్యార్థులను మరియు బాల సభలో పాల్గొన్న తల్లిదండ్రులతో మాట్లాడి వివరాలు తెలుసు కున్నారు. పాఠశాలలో మెనూ ప్రకారం జరుగుతున్న మధ్యాహ్న భోజనం విధానంపై సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో సెక్తోరియల్ అధికారి చౌదరి ఇన్చార్జి హెచ్ఎం వేణుగోపాల్, గుండేటి యోగేశ్వర్, రాజయ్య, వెంకటేశ్వర్లు, నాగరాజు, మనోహర్ విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు.