Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 13 October 2022, 3:14 pm Posted by : Anjaneyulu Dega

కాళ్లూ చేతులు కట్టేసి.. తలకు ప్లాస్టిక్ కవర్ చుట్టి చంపేశారు!

జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం శివారులో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు.

ఆంజనేయులు న్యూస్, సంగారెడ్డి జిల్లా: జిన్నారం మండలం ఐడీఏ బొల్లారం శివారులో ఓ యువకుడు దారుణహత్యకు గురయ్యాడు. రింగురోడ్డు సర్వీసు రహదారిపై గుర్తుతెలియని యువకుడిని కాళ్లు, చేతులు కట్టేసి తలకు ప్లాస్టిక్ కవర్ను చుట్టి చంపేసినట్లు పోలీసులు తెలిపారు. గురువారం తెల్లవారుజామున యువకుడి హత్య జరిగి ఉంటుందని అనుమానిస్తున్నారు. ఇతర ప్రాంతాల్లో హతమార్చి ఇక్కడికి తెచ్చారా? ఇక్కడే హత్య చేశారా అనేది విచారణలో తేలుతుందని పోలీసులు చెప్పారు. క్లూస్ టీం ను తెప్పించి ఆధారాలు సేకరిస్తున్నామని ఐడీఏ బొల్లారం సీఐ సురేందర్ రెడ్డీ తెలిపారు. ప్రేమ వ్యవహారం లేదా ఆస్తి తగాదాల నేపథ్యంలో ఈ హత్య జరిగి ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. యువకుడు వయసు 30 ఏళ్లలోపే ఉన్నట్లు తెలుస్తోంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు.