Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 10 October 2022, 12:12 pm Posted by : anjudega

మునుగోడు లో హౌస్ ఫుల్.?

అద్దె ఇళ్లకు భారీగా పెరిగిన డిమాండ్..!

ఆంజనేయులు న్యూస్, మునుగోడు: లో మొన్నటివరకు మునుగోడు నియోజకవర్గంలోని ఊళ్లలో ఇళ్ల అద్దెకు పెద్దగా డిమాండ్ ఉండేది కాదు. కానీ పరిస్థితి ఒక్కసారిగా మారింది. ఎమ్మెల్యేల నుంచి కీలక నేతల వరకు పోటీపడి మరీ అద్దె ఇళ్లకోసం వెతుకుతున్నారు. అన్ని సదుపాయాలు ఉన్న ఇంటికైతే.. 20 రోజులకే ఏకంగా రూ.50వేల నుంచి లక్ష రూపాయల వరకు చెల్లిస్తున్నారు. మరోవైపు ఊళ్ల నుంచి ఉపాధి కోసం వెళ్లిన వారిని విమాన, రైలు టికెట్లు బుక్ చేసి మరీ వెనక్కి రప్పిస్తున్నారు.