Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 09 October 2022, 2:27 pm Posted by : Anjaneyulu Dega

తెరాస సర్పంచ్ కారుకు నిప్పంటించిన దుండగులు

కామారెడ్డి జిల్లాలో తెరాస సర్పంచ్ కారుకు దుండగులు నిప్పంటించారు. రామారెడ్డి మండలం ఈసన్నపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం తెరాస సర్పంచ్ కందూరు బాలమణికి చెందిన కారును తన ఇంటి బయట పార్కు చేశారు.

ఆంజనేయులు న్యూస్, కామారెడ్డి జిల్లా: లో తెరాస సర్పంచ్ కారుకు దుండగులు నిప్పంటించారు. రామారెడ్డి మండలం ఈసన్నపల్లిలో ఈ ఘటన చోటుచేసుకుంది. గ్రామస్థులు తెలిపిన వివరాల ప్రకారం తెరాస సర్పంచ్ కందూరు బాలమణికి చెందిన కారును తన ఇంటి బయట పార్క చేశారు. శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు కారుకు నిప్పంటించారు. విషయం తెలుసుకున్న ఎస్సై అనిల్ ఘటనాస్థలికి చేరుకుని పరిశీలించారు. రాజకీయ కక్షతో ఉద్దేశపూర్వకంగా నిప్పు పెట్టి ఉంటారని స్థానికులు భావిస్తున్నారు. కొద్దిరోజుల క్రితం సంగారెడ్డి జిల్లాలోనూ ఇలాంటి ఘటనే చోటుచేసుకుంది. మిర్ దొడ్డి మండలం అక్బర్పేటలో తెరాస సర్పంచ్ స్వరూపకు చెందిన కారు, ట్రాక్టర్ కు దుండగులు నిప్పు పెట్టారు. ఇంటి ముందు నిలిపి ఉండగానే గుర్తుతెలియని వ్యక్తులు అర్ధరాత్రి ఈ దారుణానికి పాల్పడ్డారు.