Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 09 October 2022, 7:50 pm Posted by : Anjaneyulu Dega

ఆశ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలి.

తెలంగాణ ఆశా వర్కర్స్ యూనియన్ 2వ జిల్లా మహాసభలు విజయవంతం.

సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అబ్బోజు రమణ, దుంపల రంజిత్ కుమార్.

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: తెలంగాణ వాలంటరీ & కామ్యూనిటీ హెల్త్ వర్కర్స్ (ఆశా) యూనియన్ సిఐటియు 2వ జిల్లా మహాసభలు బెల్లంపల్లి పట్టణంలోని తాపీ సంఘం కార్యాలయంలో చాలా ఉత్సాహపూరితమైన వాతావరణంలో జరిగింది. మొదట  జిల్లా అధ్యక్షురాలు ఎస్.సమ్మక్క జెండా ఆవిష్కరణ చేసి అనంతరం సమ్మక్క అధ్యక్షతన మహాసభ ప్రారంభం జరిగింది. ఈ మహాసభలో ముఖ్యంగా హాజరైన సిఐటియు జిల్లా అధ్యక్ష కార్యదర్శులు మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన నుండి నేటి వరకు ఆశాల సమస్యలు పరిష్కరించడంలో విఫలమయిందని. ముఖ్యంగా ఒకవైపు జాబ్ చార్ట్ ఇవ్వడం లేదు, చాలి చాలని వేతనాలతో  అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మరో వైపు పని భారం పెరిగింది. ప్రజా ప్రతినిధులు, అధికారుల వేధింపులు విపరీతంగా పెరిగాయి. టిఏ, డిఏ లు లేవు. ఉద్యోగ భద్రత లేదు. పెన్షన్, ఈ.ఎస్.ఐ, లేదు. సెప్టెంబర్ 16 నుండి 18 వరకు హర్యానా రాష్ట్రంలో జరిగిన ఆశ వర్కర్స్ యూనియన్ అలిండియా కమిటీ నిర్ణయాలను జిల్లాలో అమలు చేయాలని అధిక ధరల భారంతో ప్రతి వస్తువులపై జిఎస్టీ వేసి ప్రజల డబ్బును దోచుకుంటుంది. నేటి దేశంలో ఆశలకు ఉద్యోగ భద్రత లేదు. ఇతర సమస్యలు పరిష్కారం కోసం, భవిష్యత్తు కార్యాచరణ రూపొందించుకోవడం జరిగింది.

ఆశ వర్కర్స్ ఎదుర్కొంటున్న అనేక సమస్యలు పరిష్కరానికై పోరాటాలకు పిలుపు నిచ్చిన సీఐటీయు జిల్లా కమిటీ. అనంతరం నూతన జిల్లా కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నూతన జిల్లా కమిటీని 24 మందితో ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో రాణి, పుష్పలత, సరోజ, భాగ్య లక్ష్మి, నీరజ, సునీత, పద్మ , విజయలక్ష్మి, ప్రజా సంఘాల, యువజన సంఘం నాయకులు గోమాస అశోక్, దేవదాస్ మరియు జిల్లాలోని అన్ని మండలాల నుండి ఆశలు అందరు పాల్గొన్నారు.