Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 08 October 2022, 10:43 pm Posted by : Anjaneyulu Dega

మునుగోడు సమావేశంలో మాజీ ఎమ్మెల్సీ ప్రేమ్ సాగర్ రావు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మునుగోడు ఉప ఎన్నికల నేపథ్యంలో మాజీ ఎమ్మెల్సీ, ఏ.ఐ. సీ.సీ. సభ్యులు కొక్కిరాల ప్రేమ్ సాగర్ రావు ఆధ్వర్యంలో  పోలింగ్ బూతు ఇంచార్జి లతో సమావేశం నిర్వహించారు. శనివారం సాయంత్రం హైదరాబాద్ లోని చిరాన్ ఫోర్ట్ క్లబ్ లోని సమావేశ మందిరంలో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథులుగా సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, ఏఐసీసీ కార్యదర్శి, తెలంగాణ ఇంచార్జి బోస్ రాజు, ఏఐసీసీ కార్యదర్శి రోహిత్ చౌదరి, ములుగు ఎమ్మెల్యే సీతక్క హాజరయ్యారు. ఈసందర్భంగా మునుగోడు ఎన్నికలపై సుదీర్ఘంగా చర్చించారు. ఎన్నికల్లో విజయం కోసం అనుసరించవలసిన వ్యూహాలపై పోలింగ్ బూతు ఇంఛార్జీలకు మార్గ నిర్ధేశం చేశారు. కాంగ్రెస్ అభ్యర్థిని భారీ మెజార్టీతో గెలిపించడానికి ప్రతి ఒక్కరు సైనికుల్లా పని చేయాలని, ఎన్నికల ను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలని సూచించారు.  ఈ సమావేశంలో మంచిర్యాల డీసీసీ అధ్యక్షురాలు కొక్కిరాల సురేఖ ప్రేమ్ సాగర్ రావు, రంగారెడ్డి డీసీసీ అధ్యక్షులు నర్సింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.