Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 07 October 2022, 2:12 pm Posted by : Anjaneyulu Dega

కేసీఆర్ జాతీయ పార్టీ విఫల ప్రయోగం: కోదండరామ్

సీఎం కేసీఆర్ తక్షణ రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఆలోచిస్తారని.. దీర్ఘకాలిక ప్రయోజనాలపై కాదని తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్ అన్నారు.

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: సీఎం కేసీఆర్ తక్షణ రాజకీయ అవసరాల కోసం మాత్రమే ఆలోచిస్తారని.. దీర్ఘకాలిక ప్రయోజనాలపై కాదని తెలంగాణ జనసమితి (తెజస) అధ్యక్షుడు ప్రొ. కోదండరామ్ అన్నారు. నాంపల్లిలోని పార్టీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. జవహర్లాల్ నెహ్రూ, అంబేడ్కర్ లాంటి వారికి సిద్ధాంతం ఉంది కాబట్టే ఆర్థిక నమూనా తయారు చేశారన్నారు. సీఎం కేసీఆర్ కు ఆ రెండూ లేవని.. వైఫల్యాలను కప్పిపుచ్చుకోవడానికే జాతీయ పార్టీ పేరుతో ఆయన నాటకాలాడుతున్నారని విమర్శించారు. కుటుంబ ఆర్థిక అవసరాల కోసం అధికారాన్ని వాడుకుంటున్నారని ఆరోపించారు.
కేసీఆర్ జాతీయ పార్టీ విఫల ప్రయోగమని.. తెలంగాణ అస్తిత్వాన్ని రాజకీయ ప్రయోజనాల కోసం తాకట్టు పెట్టారని కోదండరామ్ ఆక్షేపించారు. తెలంగాణ అస్తిత్వాన్ని, వాదాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. దిల్లీ స్థాయిలో తెలంగాణ మోడల్ డొల్లతనాన్ని బయట పెడతామన్నారు. హైదరాబాద్, దిల్లీలో సదస్సులు పెట్టి భారాస, తెలంగాణ మోడల్ కుట్రలను బహిర్గతం చేస్తామని చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం కృషి చేస్తున్నప్పుడు ఆస్తుల పెంచుకునేందుకు సమయం ఎలా దొరికిందని ప్రశ్నించారు. రాష్ట్ర ప్రజల అభ్యున్నతి కోసం ప్రత్యేకమైన అజెండాతో ముందుకు రావాలని కోదండరామ్ సూచించారు.

• మునుగోడులో పోటీ చేస్తాం..
మునుగోడు ఉపఎన్నికలో తెజస పోటీ చేస్తుందని కోదండరామ్ స్పష్టం చేశారు. త్వరలోనే అభ్యర్థిని ప్రకటిస్తామన్నారు. ప్రజాగాయకుడు గద్దర్ ఉమ్మడి తెలంగాణ సమాజం ఆయన వెంట ఉంటుందన్నారు. తెజస తరపున తాము కూడా. మద్దతిస్తామని చెప్పారు.