Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 04 October 2022, 5:36 pm Posted by : Anjaneyulu Dega

పండుగను ప్రశాంతంగా జరుపుకోవాలి

గొడవలకు దారి తీస్తే చట్ట ప్రకారం కఠిన చర్యలు: ఎస్.ఐ రాజశేఖర్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: నెన్నెల పోలీస్ స్టేషన్ పరిధిలోని ప్రజలందరూ దసరా పండగను ప్రశాంత, స్నేహపూరిత వాతావరణంలో సంతోషంగా జరుపుకోవాలని నెన్నెల ఎస్ఐ రాజశేఖర్ మంగళవారం ప్రకటనలో పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎస్సై మాట్లాడుతూ. ప్రతి ఒక్కరూ కుటుంబ సభ్యులు, బంధు మిత్రులతో సంతోషగా అందరితో కలసి మెలసి జరుపుకోవాలని కోరారు. అదేవిధంగా జమ్మిపూజలు సాంప్రదాయ పద్ధతిలో జరుపుకోవాలని అన్నారు. దసరా రోజు అందరూ ప్రశాంతమైన వాతావరణంలో దసరా జరుపుకోవాలని అలా కాకుండా గొడవలకు అల్లర్లకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కావునా ప్రజలు, ప్రజాసంక్షేమం కోసం మంచి ఉద్దేశ్యంతో పోలీసులకు సహకరించాలని ఎస్.ఐ తెలిపారు.