మాస్టర్ ప్లాన్ రూపొందించాలి.
మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలోని మున్సిపాలిటీల పరిధిలో భవిష్యత్ తరాలకు ఉపయోగపడే విధంగా మాస్టర్ ప్లాన్ రూపొందించాలని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సమావేశ మందిరంలో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో 5 మున్సిపాలిటీల కమీషనర్లు, చైర్పర్సన్లు, సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత నూతన పురపాలక చట్టం ప్రకారం పట్టణాలలో...