Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 01 October 2022, 10:03 pm Posted by : Anjaneyulu Dega

జిల్లాలో 30 పోలీస్ ఆక్ట్ అమలు

ఆంజనేయులు న్యూస్, కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా: జిల్లాలో శాంతి భద్రతల దృష్ట్యా, ప్రశాంతత ను పెంపొందించేందుకు జిల్లా అంతటా అక్టోబర్ 01 నుంచి అక్టోబర్ 31 వరకు 30 పోలీస్ ఆక్ట్ 1861 అమలులో ఉంటుందని జిల్లా సూపరిండెంట్ అఫ్ పోలీస్ కే. సురేష్ కుమార్ ఐపీఎస్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 30 పోలీస్ఆక్ట్  1861 అమలులో ఉన్నందున జిల్లాలో సబ్ డివిజనల్ పోలీస్ అధికారి లేదా పోలీస్ ఉన్నత అధికారుల నుంచి అనుమతి లేకుండా ఎటువంటి పబ్లిక్ మీటింగులు, ఊరేగింపులు, ధర్నాలు జరపరాదు. నిషేదిత ఆయుధములు అయిన కత్తులు, చాకులు, కర్రలు, జెండా కర్రలు, దుడ్డుకర్రలు, తుపాకులు ప్రేలుడు పదార్థములు, నేరమునకు పురిగొల్పే ఎటువంటి ఆయుధములను వాడరాదు.

ప్రజలకు ఇబ్బంది, చిరాకు కలిగించేందుకు దారితీసే పబ్లిక్ మీటింగ్ లను మరియు జనసమూహం ప్రోగు అవుట వంటివి నిషేధం. రాళ్ళను జమ చేయుట, దరించి సంచరించుట వంటివి నిషేధం. లౌడ్ స్పీకర్ లు, డీజే లు వంటివి కూడా ఈసమయంలో నిషేధము. నియమాలు ఎవరైనా ఉల్లంఘించిన 30 పోలీస్ ఆక్ట్ 1861 కింద శిక్షార్హులు అగుదురని ఎస్పి పేర్కొన్నారు.