Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 01 October 2022, 9:36 pm Posted by : Anjaneyulu Dega

తరగతులు నిర్వహిస్తే గుర్తింపు రద్దు: ఇంటర్ బోర్డు

జూనియర్ కళాశాలలు దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే అనుబంధ గుర్తింపు రద్దు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఇంటర్ బోర్డు హెచ్చరించింది. కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్ పై కూడా చర్యలు తీసుకుంటామని వెల్లడించింది.

ఆంజనేయులు న్యూస్, హైదరాబాద్: జూనియర్ కళాశాలలు దసరా సెలవుల్లో తరగతులు నిర్వహిస్తే అనుబంధ గుర్తింపు రద్దు వంటి కఠిన చర్యలు తీసుకుంటామని తెలంగాణ ఇంటర్ బోర్డు హెచ్చరించింది. కళాశాలల యాజమాన్యాలు, ప్రిన్సిపల్స్ పై కూడా చర్యలు తీసుకుంటామని ఇంటర్ బోర్డు కార్యదర్శి తెలిపారు. రేపటి నుంచి ఈనెల 9వరకు ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్, గురుకుల జూనియర్ కాలేజీలకు సెలవులు ఉంటాయని ఇంటర్ బోర్డు ప్రకటించింది. ఈనెల 10న కాలేజీలు తిరిగి  ప్రారంభమవుతాయని బోర్డు కార్యదర్శి తెలిపారు.