కేంద్ర మంత్రులు ఇక్కడ విమర్శిస్తున్నారు. దిల్లీలో అవార్డులిస్తున్నారు: సీఎం కేసీఆర్
ఆంజనేయులు న్యూస్, హనుమకొండ: తెలంగాణ ప్రజల అండదండలతో కొనసాగిన ఉద్యమం అద్భుతంగా రాష్ట్రాన్ని సాధించడమే కాకుండా అనేక రంగాల్లో ఇవాళ రాష్ట్రాన్ని అగ్రగామిగా నిలిపిందని సీఎం కేసీఆర్ అన్నారు. తెలంగాణ దేశంలోనే నంబర్ వన్ గా ఉందని.. ఇందులో ఎవరికీ ఎలాంటి సందేహం అవసరం లేదన్నారు. వరంగల్ లో ప్రతిమ క్యాన్సర్ ఆస్పత్రిని సీఎం కేసీఆర్ ఇవాళ ప్రారంభించారు. 350 పడకల సామర్థ్యంతో ఆస్పత్రిని నిర్మించారు. ప్రతిమ వైద్య కళాశాలలో 150 మెడికల్ ఎంబీబీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. క్యాన్సర్ ఆస్పత్రి ప్రారంభోత్సవం అనంతరం...