గర్భస్రావాలపై సుప్రీంకోర్టు కీలకతీర్పు.?
పెళ్లితో సంబంధం లేదు మహిళలందరికీ అబార్షన్ చేయించుకునే హక్కుంది..! ఆంజనేయులు న్యూస్, దిల్లీ: మహిళల గర్భస్రావాలపై సుప్రీంకోర్టు గురువారం కీలక తీర్పు వెలువరించింది. చట్టపరంగా మహిళలందరికీ సురక్షితంగా అబార్షన్లు చేయించుకునే హక్కు ఉందని తెలిపింది. ఇందులో వివాహితులు, అవివాహితులు అంటూ తేడా చూపించడం రాజ్యాంగవిరుద్ధమని స్పష్టం చేసింది. ఈ సందర్భంగా ‘వైవాహిక అత్యాచారాన్ని’ కూడా కోర్టు ప్రస్తావించింది. బలవంతపు గర్భధారణ నుంచి మహిళలను కాపాడాల్సిన అవసరం ఉందని పేర్కొంది. మెడికల్ టర్మినేషన్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి సంబంధించిన ఓ కేసు విచారణలో భాగంగా జస్టిస్ డీవై...