Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 26 September 2022, 1:11 pm Posted by : Anjaneyulu Dega

ఎమ్మెల్యే జోగు రామన్నను పరామర్శించిన మంత్రి కేటీఆర్‌

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్‌ జిల్లా: మాతృవియోగంతో బాధలో ఉన్న ఎమ్మెల్యే జోగు రామన్నను మంత్రి కే.తారకరామారావు పరామర్శించారు. దీపాయిగూడలోని జోగు రామన్న నివాసానికి వెళ్లిన మంత్రి కేటీఆర్‌.. జోగు భోజమ్మ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. అనంతరం ఎమ్మెల్యే కుటుంబ సభ్యులను పరామర్శించారు. మంత్రి కేటీఆర్‌తోపాటు మంత్రులు శ్రీనివాస్‌గౌడ్‌, సబితా ఇంద్రారెడ్డి, ఇంద్రకరణ్‌ రెడ్డి ఉన్నారు.

అనంతరం మంత్రులు రోడ్డు మార్గం ద్వారా 11.30 గంటలకు ఆదిలాబాద్‌ పట్టణానికి చేరుకుంటారు. బీడీఎన్‌టీ ల్యాబ్స్‌, ఎన్‌టీటీ డాటా బిజినెస్‌ సొల్యూషన్స్‌ ఐటీ టవర్స్‌ ఉద్యోగులతో సమావేశమవుతారు. మధ్యాహ్నం 12.30 గంటలకు ఆదిలాబాద్‌ నుంచి బయలుదేరి ఒంటి గంటకు నిర్మల్‌ జిల్లా బాసర చేరుకుంటారు. ట్రిపుల్‌ ఐటీ విద్యార్థులతో భేటీ అనంతరం వారితో కలిసి భోజనం చేస్తారు. 3 గంటలకు హైదరాబాద్‌ బయలుదేరుతారు.