Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 26 September 2022, 10:28 am Posted by : Anjaneyulu Dega

దళిత సంఘాల రాస్తారోకో.?

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: బెల్లంపల్లి నియోజకవర్గంలోని నెన్నల మండలం మైలారం గ్రామానికి చెందిన తిమ్మల మానస గిరిజన మహిళను ఇదే గ్రామానికి చెందిన బొమ్మెన సంతోష్ గౌడ్ ఆరు సంవత్సరాలుగా ప్రేమించి వివాహం చేసుకుంటానని చెప్పి శారీరకంగా మానసికంగా వాడుకొని ఐదు లక్షల కట్నం మాట్లాడి ఒక గిరిజన మహిళ కాబట్టి ఇంకో మహిళతో ప్రేమ కొనసాగిస్తున్నాడు వెంటనే పోలీస్ శాఖ వారు సంతోష్ గౌడ్ ను అరెస్టు చేసి కఠినంగా శిక్షించాలని అలాగే వీరికి అండగా సంతోష్ గౌడ్ సోదరుడు బిజెపి జిల్లా అధికార ప్రతినిధి బొమ్మేన హరీష్ గౌడ్ అధికారాన్ని అడ్డుపెట్టుకుని అమ్మాయికి ఆన్న్యాయం చేస్తున్నాడని  గిరిజన మహిళకు న్యాయం జరిగేలా చూడాలని లేనిపక్షంలో నిరంతరం జిల్లాల వ్యాప్తంగా ఉద్యమం ఎస్సీ ఎస్టీ ఆధ్వర్యంలో దళిత సంఘాల ఆధ్వర్యంలో నిరసనలు రాస్తారోక కార్యక్రమాలు నిర్వహిస్తామని అన్నారు.

ఈయొక్క కార్యక్రమంలో తెలంగాణ మాల మహానాడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసర్ల యాదగిరి తెలంగాణ మాల మహానాడు మంచిర్యాల జిల్లా అధ్యక్షులు కుంభాల రాజేష్, రాష్ట్ర యువజన అధ్యక్షుడు ఆసాది మధు, జిల్లా గౌరవ అధ్యక్షులు బండి ప్రసాద్, కార్యదర్శి ఎరుకల నర్సింగ్, ఉపాధ్యక్షులు మద్దెల గోపి, పట్టణ అధ్యక్షులు బందెల మురళి, మహిళ నాయకురాలు దాసరి జయ, అనసూర్య, తదితరులు పాల్గొన్నారు.