Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 21 September 2022, 2:26 pm Posted by : Anjaneyulu Dega

బాల్క సుమన్ అనుచరుల ఆగడాలకు అడ్డులేకాపాయే?

దళితులపై దాడి చేసినవారిని తక్షణమే అరెస్టు చెయ్యాలి

బంగారు తెలంగాణలో దళితులకు రక్షణేదీ

అక్రమంగా దళితుల భూములు లాక్కుంటున్నారు.

ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారు.

దాడులు తట్టుకోలేక ఊరు నుండి వెళ్లిపోయిన దళితులు

దళితులకు నేటికీ గుడిలోకి ప్రవేశం లేదు

ఎమెల్యే, ప్రభుత్వ వీఫ్,  బాల్క సుమన్ అనుచరుల ఆగడాలకు అడ్డులేకాపాయే?

అగ్రవర్ణల దాడిలో గాయపడిన  బాధితులను పరామర్శించిన సిపిఎం జిల్లా కమిటీ బృందం..

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జైపూర్ మండలం గంగిపెల్లి గ్రామంలో అగ్రవర్ణల చేతిలో గాయపడిన బాధితులను గురువారం రోజున సిపిఎం జిల్లా బృందం పరామర్శించడం జరిగింది. ఈ సందర్బంగా సంకె రవి సిపిఎం జిల్లా కార్యదర్శి మాట్లాడుతూ. గంగిపల్లి గ్రామానికి చెందిన జనాంపల్లి సురేష్ జనాంపల్లి సంపత్  అనే దళిత కులానికి చెందినవారిని.గత ఆదివారం గ్రామంలో సాయంత్రం సుమారు 5 గంటల సమయంలో గ్రామ పంచాయతీ వద్ద అదే గ్రామానికి చెందిన రెడ్డి కులానికి చెందిన నరెడ్ల గోపాల్ రెడ్డి (ఎంపిటిసి భర్త ), నరేడ్ల రాజిరెడ్డి (ఉప సర్పంచ్) లను బాధితులు తమకురావల్సిన భూముల డబ్బులు ఇవ్వాలని అడిగినందుకు విచక్షణ రహితంగా కొట్టి, కులం పేరుతో దుశించి బూతులు తిట్టి, వారిని చంపే ప్రయత్నం చేసారు. ఇదే కాకుండా గతంలో అగ్రవర్ణలవారి ఆగడలు, దాడులు తట్టుకోలేక గ్రామం నుండి అనేక మంది దళితులు వేరే ఊర్లకు వెళ్లిపోయిన సంగటనలున్నాయి. అదేవిధంగా గ్రామంలోని ఇంకో 7 గురి దగ్గర నుండి సుమారు 20 ఎకరాలు భూమిని ఆక్రమించుకున్నారు. అంతే కాకుండా గ్రామంలోని ప్రభుత్వ గుడిలోకి కూడ రానివ్వడం లేదని.

ఇంకా ఎన్ని రోజులు ఈ దాడులు తెలంగాణలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. జిల్లా పోలీస్ యంత్రంగం స్పందించి దాడి చేసిన వారిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసారు. కానీ అరెస్టు మాత్రం చేయలేదు. వెంటనే అరెస్టు చేసి, బాధితులకు అండగా నిలబడాలని కోరుతున్నాం. గ్రామంలో అహంకార పూరితంగా వ్యవరిస్తున్న అగ్రకుల దురంకారులు తమపద్దతులు మానుకొని మనుషుల్లా బ్రతకాలి. దళితుల నుండి గుంజుకున్న భూములు తిరిగి దళితులకిహ్వాలని లేకుంటే దళితుల భూముల రక్షణకు సీపీఎం పోరాటం చేస్తుంది. దాడులు, దౌర్జన్యాలు చేస్తున్నవారికి బుద్ది చెప్పేవిదంగా సీపీఎం పోరాటం చేస్తుంది. ఈ కార్యక్రమంలో సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు దుంపల రంజిత్ కుమార్, సిపిఎం నాయకులు మహేందర్, సరోజ, వనిత, శిరీష, స్వరూప తదితరులు పాల్గొన్నారు.