Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 20 September 2022, 10:53 pm Posted by : Anjaneyulu Dega

సింగరేణి కాంట్రాక్ట్ కార్మికుల సమ్మెపై చర్చించిన డైరెక్టర్లు

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: మందమరి ఏరియాలో సింగరేణి డైరెక్టర్ పా, చంద్రశేఖర్ నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ లో మందమరి జిఎం చింతల శ్రీనివాస్ పాల్గొనడం జరిగింది. ప్రైవేట్ కాంట్రాక్ట్ వర్కర్స్ చేస్తున్న సమ్మె గురించి అన్ని ఏరియాలోని జీఎం లను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డైరెక్టర్ ప్రైవేట్ కాంట్రాక్టు ఉద్యోగుల సమ్మె సంబంధిత అంశాలపై చర్చించడం జరిగింది. గత కొన్ని రోజులుగా ప్రైవేటు కాంట్రాక్టు ఉద్యోగులు సమ్మెలో ఉండడం వలన కలిగిన అసౌకర్యాలను డైరెక్టర్ తెలుసుకున్నారు. అలాగే ఈ సమ్మె ఇలాగే కొనసాగితే తీసుకోవాల్సిన చర్యలపై చర్చించడం జరిగింది.

ఈ కార్యక్రమంలో డి వై ఎన్ సివిల్ శ్రీనివాసులు, డి వై పి ఎం శ్యాంసుందర్, మందమర్రి ఏరియాలోని అన్ని గనుల మేనేజర్లు, ఎస్ ఎస్ ఓ , ఎస్ అండ్ పీసీ రవి, ఐటీ ప్రోగ్రామర్ రవి పాల్గొన్నారు.