
ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కె. సురేష్ కుమార్
ఆంజనేయులు న్యూస్, కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: ఆదివాసీ ప్రాంత ప్రజల అభివృద్ధి, సంక్షేమమే పోలీసుల లక్ష్యం అని కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా ఎస్పీ కె. సురేష్ కుమార్ అన్నారు. మంగళవారం లింగాపూర్ పోలిస్టేషన్ పరిధిలోని చిన్నధంపూర్ గ్రామానికి వెళ్ళి, అక్కడి ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా గ్రామ ప్రజలతో సమావేశమై వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఇతర శాఖల అధికారులతో మాట్లాడి వెంటనే అట్టి సమస్యలను పరిష్కరిస్తామని వారికి హామీ ఇచ్చారు. తమ గ్రామంలోకి ఎవరైనా కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే వెంటనే పోలీసు వారికి సమాచారం అందించాలని కోరారు.
ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ యువతీ, యువకులు మావోయిస్టు/తీవ్రవాద కార్య కలాపాలకు దోహదపడి తమ భవిష్యత్తును నాశనం చేసుకోకూడదని పేర్కొన్నారు. ఈ ప్రాంతంలో మావోయిస్టు దళ సభ్యులు కదలికలు ఉన్నట్లు దృష్టికి వస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. ప్రభుత్వము బడుగు బలహీన వర్గాలకు, ఆదివాసి ప్రజల అభివృద్ధికి అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తుందని, మావోయిస్టుల ఆగడాలకు ఉనికికి అడ్డుకట్ట వేయలని సూచించారు. ప్రజలకు ఏ సమస్యలు ఉన్న ప్రభుత్వం, పోలీసుల ద్వారా పరిష్కరించుకోవాలని, పోలీసులు మీకోసం కార్యక్రమం ద్వారా జిల్లాలో గిరిజన ప్రాంతాల్లో ఎన్నో సహాయ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని, ఉచిత కంటి వైద్య శస్త్ర చికిస్త, కృతిమ కాలు అమర్చడం కోసం, కావలసిన వారు లింగాపూర్ పోలీస్ స్టేషన్ నీ సంప్రదించాలని ఎస్పీ గారు పేర్కొన్నారు. అపరిచిత వ్యక్తుల సమాచారం తెలిస్తే పోలీస్ స్టేషన్ లో తెలియజేయాలి లేదా డయల్ 100 కీ కాల్ చేసి తెలియజేయాలని కోరారు. తెలిపిన వారి వివరాలు రహస్యంగా ఉంచబడుతాయని మరియు వారికి తగిన బహుమతి ఇవ్వబడును అని అన్నారు. ఈ కార్యక్రమంలో ఆసిఫాబాద్ డీఎస్పీ శ్రీనివాస్, జైనుర్ సి.ఐ. రామకృష్ణ మరియు ఇతర పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు.