Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 15 September 2022, 1:32 pm Posted by : Anjaneyulu Dega

వాహనం ఢీకొని చిరుత మృతి.?

ఆంజనేయులు న్యూస్, కామారెడ్డి జిల్లా: లో సదాశివనగర్ మండలం దగ్గి అటవీప్రాంతంలోని 44వ నంబరు జాతీయ రహదారిపై గుర్తుతెలియని వాహనం ఢీకొని ఓ చిరుత పులి మృత్యువాత పడింది. గురువారం తెల్లవారుజామున ఈ ఘటన చోటుచేసుకుంది. మృతిచెందిన చిరుత వయసు ఏడాదిన్నర నుంచి రెండేళ్లు ఉంటుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. చిరుత రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన గుర్తుతెలియని వాహనం దాన్ని ఢీకొని ఉంటుందని భావిస్తున్నారు. చిరుత కళేబరాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా అటవీశాఖ కార్యాలయానికి తరలించారు.