Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 15 September 2022, 1:09 pm Posted by : Anjaneyulu Dega

ఎక్కడైనా బతుకు.. పెద్దయ్యాక తిరిగి రా!

ఎనిమిదేళ్ల కుమారుణ్ని రైలెక్కించిన తల్లి

ఆంజనేయులు న్యూస్, జనగామ జిల్లా: కుమారుణ్ని రైలు ఎక్కించి పంపిన తల్లిదండ్రులకు గురువారం పోలీసులు కౌన్సెలింగ్ చేశారు. జనగాం జిల్లా స్టేషన్ ఘన్ పూర్ ఏసీపీ రఘుచందర్ తెలిపిన వివరాల ప్రకారం.. నగరంలోని రామంతాపూర్ కు చెందిన అంబికకు కుమారుడు మణికంఠ ఉన్నారు. భర్త చనిపోవడంతో శ్రీను అనే వ్యక్తిని రెండో పెళ్లి చేసుకొంది. వీరికి పాప జన్మించింది. ఎనిమిదేళ్ల మణికంఠ చెప్పిన మాట వినడం లేదని, ఎదురుతిరుగుతున్నాడని మంగళవారం సాయంత్రం వారు సికింద్రాబాద్ నుంచి భద్రాచలం వెళ్లే కాకతీయ ఫాస్ట్ ప్యాసింజర్ ఎక్కించారు. ఎక్కడైనా బతకమని, పెరిగి పెద్దయ్యాక తమ వద్దకు రమ్మని చెప్పింది. రైలులో ఒంటరిగా తిరుగుతున్న బాలుడిని గమనించిన కొందరు.. స్టేషనఘన్పూర్ ఠాణాలో అప్పగించారు. బుధవారం తల్లిదండ్రులను రప్పించి కౌన్సెలింగ్ చేశారు. అయినా బాలుడిని తీసుకెళ్లడానికి నిరాకరించడంతో చైల్డ్ లైన్ ప్రతినిధులకు అప్పగించారు.