Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 14 September 2022, 10:32 pm Posted by : Anjaneyulu Dega

శ్రీ చైతన్య పాఠశాలను వెంటనే సీజ్ చేయాలి

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి: బెల్లంపల్లి పట్టణంలో ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్న శ్రీ చైతన్య పాఠశాలను వెంటనే సీజ్ చేయాలని తెలంగాణ పద్మశాలి విద్యార్థి సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చేరల వంశీ డిమాండ్ చేశారు. ఈ మేరకు బుధవారం ఆయన మంచిర్యాల జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ. పాఠశాలలో కనీస సౌకర్యాలు లేవని, అర్హత లేని టీచర్లను నియమించి విద్యార్థుల తల్లిదండ్రులకు మాయమాటలు చెప్పి అడ్మిషన్లు చేస్తున్నారని తెలిపారు. విద్యా సంవత్సరం ప్రారంభమై కొద్ది కాలమైనా ఏడాది మొత్తం ఫీజులను పాఠశాల యాజమాన్యం వసూలు చేస్తుందని ఆయన పేర్కొన్నారు.

వెంటనే విద్యాశాఖ అధికారులు శ్రీ చైతన్య పాఠశాలను సీజ్ చేసి విద్యార్థులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో టిపివిఎస్ జిల్లా నాయకులు చందు, సాయి, రమేష్, రాజు, రవి, సోహెల్, నరేష్, తదితరులు పాల్గొన్నారు.