Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 13 September 2022, 8:03 am Posted by : Anjaneyulu Dega

ఆ ఇద్దరి మరణాలు అనుమానస్పదం..?

మరణాలపై పోలీస్ విచారణ చేపట్టాలి.

బాధిత మహిళ మర్రిపల్లి మాధురి డిమాండ్.?

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: రామకృష్ణాపూర్ పట్టణంలోని క్యాతనపల్లి ప్రెస్ క్లబ్ లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో బాధిత మహిళ మర్రిపల్లి మాధురి పలు వివాదాస్పద వాఖ్యలు చేయడం జిల్లా లో చర్చనీయాంశంగా మారింది. గత రెండు సంవత్సరాల క్రితం చనిపోయిన తన మామ మర్రిపెల్లి శంకర్ ఇటీవల 8 నెలల క్రితం మరణించిన తన భర్త రమేష్ మృతి పై బాధిత మహిళ పలు అనుమా నాలను వ్యక్తం చేసింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. తన భర్త, మామ మరణాలు సహజమైనవి కావని, కుట్ర పూరితంగానే ఆస్థి కోసం తన కుటుంబ సభ్యులు చంపారని ఆరోపించారు. పోస్టుమార్టం చేయాలని డిమాండ్ చేసిన, తన ఆడపడుచులు, వారి భర్తలు నిరాకరించారని, బాధిత మహిళ భర్త రమేష్ మరణించిన సమయంలో తన ఆడపడుచు భర్త 15 రోజులు కనిపించకుండా పోవడం జరిగిందని వివరించారు. తన భర్త పోస్ట్ మార్టం నివేదికలో వాస్తవ విషయాలు రాకుండా డబ్బులు ఖర్చు చేసి మార్పిడి చేశారనే అనుమానాలు ఉన్నాయని, మామ శంకర్ సింగరేణి పదవీ విరమణ పొందని అనంతరం వచ్చిన డబ్బులు మొత్తం తన ఆడపడుచులు, వారి భర్తలు తనను భయబ్రాంతులకు గురి చేసి తీసుకున్నారని అన్నారు.

తన భర్త, మామ మరణాలపై పోలీసులకు ఫిర్యాదు చేసిన పట్టించు కోలేదని, సరైన విచారణ జరపకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని, పోలీసులు కేసును తిరిగి విచారణ చేసి తనకు న్యాయం చేయాలని ఆవేదన వ్యక్తం చేశారు. తనకు ప్రాణహాని ఉందని, తనకు, తన కుటుంబ సభ్యులు ఎలాంటి హాని జరిగిన తన ఆడపడుచులు, వారి భర్తలు, రామకృష్ణాపూర్ కు చెందిన ఓ పత్రిక విలేకరి పూర్తి బాధ్యత వహించాలని తెలిపారు.