Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 11 September 2022, 7:03 pm Posted by : Anjaneyulu Dega

ప్రగతిభవన్ లో కేసీఆర్ తో కుమారస్వామి భేటీ

హైదరాబాద్: తెలంగాణ సీఎం కేసీఆర్ కర్ణాటక మాజీ సీఎం కుమారస్వామి భేటీ అయ్యారు. ప్రగతిభవన్ లో కేసీఆర్ ను ఆయన కలిశారు. నేతలిద్దరూ కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. అనంతరం తాజా రాజకీయ పరిస్థితులు, దేశంలో జరుగుతున్న పరిణామాలపై కేసీఆర్, కుమారస్వామి చర్చిస్తున్నట్లు సమాచారం. జాతీయ రాజకీయాల్లో ప్రాంతీయ పార్టీల పాత్ర, కేసీఆర్ కొత్త జాతీయ పార్టీ ఏర్పాటు, భవిష్యత్ కార్యాచరణపై నేతలిద్దరూ చర్చిస్తున్నట్ల తెలుస్తోంది.

కేసీఆర్ ఇప్పటికే బెంగళూరు వెళ్లి మాజీ ప్రధాని దేవెగౌడ, కుమారస్వామితో చర్చించారు. జాతీయ స్థాయిలో రాజకీయ పార్టీ ఏర్పాటుకు సన్నాహాలు చేస్తున్న కేసీఆర్.. ఇప్పటికే దేశంలోని వివిధ పార్టీల నేతలతో చర్చించారు. భాజపాను గద్దె దించేందుకు కలిసి రావాలని ఆయా పార్టీల నేతలను కోరారు. ఈ నేపథ్యంలోనే హైదరాబాద్ వచ్చిన కుమారస్వామి.. కేసీఆర్ తో ప్రత్యేకంగా సమావేశమయ్యారు.