Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 10 September 2022, 7:59 pm Posted by : Anjaneyulu Dega

తిలకం దిద్ది… టోపీ పెట్టిన అదనపు కలెక్టర్

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: ఆదిలాబాద్ లో జరిగిన గణేష్ నిమజ్జనోత్సవం లో జిల్లా అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. మతాలకతీతంగా పండగలను జరుపుకోవాలని ప్రతి ఒక్కరూ చెప్పుకోవడం వింటుంటాం. కానీ వాటిని నిరూపించే వారు అరుదుగా కనబడుతుంటారు. అటువంటి కోవకే చెందుతారు జిల్లా అదనపు కలెక్టర్. ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని శ్రీ సరస్వతి శిశు మందిర్ పాఠశాలలో గణేష్ నిమజ్జన శోభాయాత్రను హిందూ సమాజ్ ఉత్సవ సమితి ఆధ్వర్యంలో చేపట్టారు. ఐతే ఈ కార్యక్రమానికి జిల్లా స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ రిజ్వాన్ భాషా షేక్ సైతం పాల్గొన్నారు. కాగా ఉత్సవాల్లో పాల్గొన్న అదనపు కలెక్టర్ కు సమితి సభ్యులు కాషాయ కండువా కప్పి, టోపీనీ బహూకరించారు. అయితే అదనపు కలెక్టర్ రిజ్వాన్ వాటిని ధరించడమే కాకుండా నుదుట తిలకం పెట్టుకొని మతసామరస్యాన్ని చాటుకున్నారు. మతాలకతీతంగా పండగలను జరుపుకోవాలని ఆయన అన్నారు. ఏది ఏమైనా మతసామరస్యాన్ని చాటిచెప్పిన అదనపై కలెక్టర్ పై పలువురు ప్రశంసలు కురిపిస్తున్నారు.