Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 10 September 2022, 10:08 pm Posted by : Anjaneyulu Dega

శివాజీకి భారతీయ సేవారత్న అవార్డు

రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం కేశంపేట:భారతీయ సేవారత్న అవార్డుకు కేశంపేట గ్రామానికి చెందిన మల్తూoకర్ శివాజీ ఎంపికైనట్లు,అవార్డును కూడా శనివారం అందజేశారని అవార్డ్ గ్రహీత శివాజీ తెలిపారు.75 సంవత్సరాల స్వతంత్ర దినోత్సవం పురస్కరించుకొని పలు రంగాలలో సేవలందిస్తున్న నిర్వాహకులకు స్ఫూర్తి సర్వీస్ సొసైటీ ఆధ్వర్యంలో హైదరాబాద్ నాంపల్లి లోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ విశ్వవిద్యాలయం ఎన్టీఆర్ ఆడిటోరియంలో సమ్మేళన కార్యక్రమం నిర్వహించారని వివరించారు. ఈ కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాల్లో సేవాలు అందించిన తనకు భారతీయ సేవా రత్న అవార్డ్స్ ను అందజేశారన్నారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ గాలి వినోద్ కుమార్ చేతుల మీద ఈఅవార్డును అందుకున్నట్లు శివాజీ తెలిపారు.