Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 10 September 2022, 2:50 pm Posted by : Anjaneyulu Dega

డీసీపీ రూపేష్ ఉదారత.?

ప్రతి పౌరుని రక్షణ మా బాధ్యత..

ప్రజలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజా రక్షణే పోలిస్ ముఖ్య ఉద్దేశ్యం

పెద్దపల్లి డీసీపీ రూపేష్

ఆంజనేయులు న్యూస్, పెద్దపల్లి జిల్లా: బేగంపేట్ గ్రామం కి చెందిన వెంకన్న, TSS తెలంగాణ సంస్కృతి సారధి పెద్దపల్లి నందు విధులు నిర్వహిస్తున్నాడు. తన కూతురు ఉన్నత చదువుల కోసం ఉత్తరప్రదేశ్ కి వెళ్తుండగా వినాయక నిమజ్జనం సందర్బంగా గోదావరిఖని గోదావరి బ్రిడ్జ్ వద్ద రాత్రి 2:30 గంటల సమయం లో ట్రాఫిక్ లో ఇరుక్కొగా వెంకన్న వినాయక నిమజ్జనం పర్యవేక్షణ లో భాగంగా అక్కడే ఉన్న పెద్దపల్లి డీసీపీ సిహేచ్ రూపేష్ కు తమ ఇబ్బంది చెప్పడం తో వెంటనే స్పందించి పోలీస్ ప్రభుత్వ వాహనం లో వారిని మంచిర్యాల రైల్వే స్టేషన్ లో సకాలంలో దింపి ఢిల్లీ వెళ్లే సూపర్ ఫాస్ట్ ఎక్స్ ప్రెస్ లో వెంకన్న కూతురు ఉత్తర ప్రదేశ్ వెళ్లే లాగా సహాయం చేయడం జరిగింది. తమ సమస్య చెప్పగానే వెంటనే స్పందించి వాహన సదుపాయం కల్పించిన డీసీపీ పెద్దపల్లి గారికి, పోలీస్ శాఖ వారికి వారు కృతజ్ఞతలు ధన్యవాదములు తెలిపారు.