Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 08 September 2022, 11:33 pm Posted by : Anjaneyulu Dega

గణేష్ నిమజ్జన శోభాయాత్ర సందర్భంగా పటిష్ట బందోబస్తు

మంచిర్యాల ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్

ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: జిల్లాలో గణేష్ నిమజ్జన శోభాయాత్ర శాంతియుత వాతావరణంలో జరిగేలా పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు ఇంచార్జ్ డీసీపీ అఖిల్ మహాజన్ తెలిపారు. ప్రశాంత వాతావరణంలో శోభాయాత్ర జరుపుకొని, అన్ని వర్గాల వారు పోలీస్ యంత్రాంగానికి సహకరించాలని సూచించారు. ప్రజలు ఏలాంటి పుకార్లను నమ్మవద్దని, అవసరమైతే దగ్గరలోని సిబ్బంది లేదా పోలీస్ స్టేషన్ గాని సమాచారం అందించాలన్నారు. శోభయాత్ర జరిగే ప్రాంతాలలో ట్రాఫిక్ రూల్స్ పాటించాలని, మద్యం త్రాగి గణేష్ వాహానాలు నడిపే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. డిజెలకు ఎట్టి పరిస్థితిలో అనుమతి లేదని, టపాకాయలు కాల్చరాదన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో రాజీ పడేది లేదని, సమస్యలు సృష్టించే ప్రయత్నం ఎవరు చేసినా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడినా, నిభంధనలు అతిక్రమించినా సంబంధిత వ్యక్తులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని, ఎంతటి వారైనా ఉపేక్షించబోమని హెచ్చరించారు.