Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 07 September 2022, 4:37 pm Posted by : Anjaneyulu Dega

డ్యాంలో ఇద్దరు విద్యార్థినిలు గల్లంతు…. ఒకరు మృతి

ఆంజనేయులు న్యూస్, ఆదిలాబాద్ జిల్లా: జైనాధ్ మండలంలో విషాదం నెలకొంది. మండలంలోని లక్ష్మిపూర్ డ్యాం లో ఇద్దరు విద్యార్థినిలు గల్లంతు కాగా ఒకరు మృతి చెందగా, మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. జైనాథ్ మోడల్ స్కూల్ లో టెన్త్ క్లాస్ చదువుతున్న ఇద్దరు విద్యార్థినిలు లక్ష్మి పూర్ డ్యాం వెళ్లగా ప్రమాదవశాత్తు జారిపడి నట్లు తెలిసింది. అయితే స్థానికులు వెంటనే గమనించి ఒకరిని రక్షించగా, మరొకరు మృతి చెందారు. రక్షించిన అమ్మాయి పరిస్థితి విషమంగా ఉండటంతో వెంటనే ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రికి తరలించారు.

విషయం తెలిసిన వెంటనే జైనథ్ ఎస్సై బిట్ల పెర్సీస్ తో పాటు స్థానికులు పెద్ద ఎత్తున ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఐతే ఈ ప్రమాదం ఎలా జరిగింది అనే పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది. విద్యార్థుల పేర్లు వివరాలు ఇంకా తెలియరాలేదు.