విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపే వారే ఉపాధ్యాయులు

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి ఆంజనేయులు న్యూస్, మంచిర్యాల జిల్లా: చదువుతో పాటు సమాజంపై అవగాహన కల్పిస్తూ విద్యార్థుల జీవితాలలో వెలుగులు నింపే వారే ఉపాధ్యాయులు అని జిల్లా కలెక్టర్ భారతి హోళ్ళికేరి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కార్మల్ కాన్వెంట్ హైస్కూల్ లో డా॥ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ట్రైనీ కలెక్టర్ పి. గౌతమి, మంచిర్యాల శాసనసభ్యులు నడిపెల్లి దివాకర్ రావుతో కలిసి హాజరై రాధాకృష్ణన్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు...