
లంచం తీసుకుంటూ గతంలో దొరికిపోయిన అధికారి
హైదరాబాద్: గతంలో లంచం తీసుకుంటూ దొరికిపోయిన మాదాపూర్ ఎస్సై కె. రాజేంద్రకు ఏసీబీ కోర్టు రెండేళ్ల జైలు శిక్ష, రూ.5 వేల జరిమానా విధించింది. ఒకవేళ జరిమానా చెల్లించకపోతే శిక్ష మరో మూడు నెలలు పొడిగించాలని ఆదేశిస్తూ తీర్పు వెలువరించింది. ప్రస్తుతం మాదాపూర్ స్టేషన్ లో పనిచేస్తున్న కె. రాజేంద్ర గతంలో రాయదుర్గం ఠాణాలో ఎస్సైగా విధులు నిర్వహించారు. 2013 జూన్ లో ఇర్షాద్ ఖురేషీ మోటారు వాహనం విడుదల చేసేందుకు రాజేంద్ర రూ.10 వేలు డిమాండ్ చేశారు. దీనిపై ఫిర్యాదు అందుకున్న అవినీతి నిరోధక శాఖ లంచం తీసుకుంటుండగా పట్టుకున్నారు. దీనిపై అప్పట్లో కేసు నమోదు చేసి విచారించగా.. తాజాగా తీర్పు వెలువడింది.