ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకున్న ప్రముఖులు

హైదరాబాద్: తెలంగాణలో వినాయక చవితి వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ప్రఖ్యాత ఖైరతాబాద్ మహాగణపతిని దర్శించుకునేందుకు హైదరాబాద్ సహా ఇతర ప్రాంతాల నుంచి భక్తులు భారీ సంఖ్యలో తరలివస్తున్నారు. మహాగణనాథుని తొలిపూజలో రాష్ట్ర గవర్నర్ తమిళిసై సౌందరరాజన్, పలువురు ప్రముఖులు పాల్గొన్నారు. ప్రజలు సుఖసంతోషాలతో ఉండేలా ఆశీర్వదించాలని ఖైరతాబాద్ గణేశ్ ను కోరుకున్నట్లు గవర్నర్ తెలిపారు. హరియాణా గవర్నర్ బండారు దత్తాత్రేయ, మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, డీజీపీ మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యే దానం నాగేందర్, మాజీ ఎమ్మెల్యే చింతల, భాజపా ఎమ్మెల్యే రఘునందన్ రావు,...