Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 01 September 2022, 2:07 pm Posted by : Anjaneyulu Dega

ఇంకెన్ని ప్రాణాలు పొట్టన పెట్టుకుంటారు.. విద్యార్థిని మృతిపై ఆందోళన

కొమురంభీం ఆసిఫాబాద్ జిల్లా: ఆసిఫాబాద్ మండలంలోని బూరుగూడ గిరిజన సంక్షేమ మహిళా డిగ్రీ కళాశాల విద్యార్థిని సంగీత (19) మృతిపై కుటుంబ సభ్యులు వివిధ సంఘాల ఆధ్వర్యంలో బుధవారం రాత్రి ఆందోళనకు దిగారు. జ్వరంతో బాధపడుతున్న సంగీతను కరీంనగర్ చెల్మడ ఆనందరావు ఆసుపత్రికి తరలించారు. రెండురోజులుగా చికిత్స పొందుతూ బుధవారం సాయంత్రం మృతి చెందింది. మృతదేహాన్ని బుధవారం రాత్రి ఆసిఫాబాద్ ఆసుపత్రికి తరలించడంతో కుటుంబ సభ్యులతో పాటు బంజారా, వివిధ యువజన సంఘాల ఆధ్వర్యంలో ధర్నా చేశారు. కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం, రూ. 25 లక్షల నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు సిరిపుర్తి మండలం చింతకుంటకు చెందిన శకుంతల, శివరామ్ల కూతురు సంగీత. ఆసిఫాబాద్ మహిళా డిగ్రీ కళాశాలలో చదువుతోంది. సోమవారం జ్వరం రావడంతో ఆమెను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.

ప్రాథమిక చికిత్స అనంతరం మంచిర్యాలకు రిఫర్ చేశారు. అక్కడి నుంచి హైదరాబాద్ నిమ్స్ కు రిఫర్ చేశరు.. రాత్రి కరీంనగర్ కు చేరుకోగానే పరిస్థితి విషమించడంతో చెల్మడ ఆనందరావు ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమించడం. బుధవారం సాయంత్రం చనిపోయింది. ఆసిఫాబాద్ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అందించడంలోనే డోస్ ఎక్కువ కావడం వల్లే చనిపోయిందని ఆరోపించారు. నిర్లక్ష్యం వహించిన కళాశాల ప్రిన్సిపల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.