Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 31 August 2022, 2:15 pm Posted by : Anjaneyulu Dega

వాసవీక్లబ్స్ ఆధ్వర్యంలో మట్టి వినాయక విగ్రహాలు పంపిణీ

మంచిర్యాల జిల్లా: పర్యావరణంను పరిరక్షించడం లో భాగంగా వాసవీక్లబ్స్ మంచిర్యాలలో చేస్తున్న సేవలు అభినందనీయం అని మాజీ ఎమ్మెల్సీ, ఎఐసిసి సభ్యులు కొక్కిరాల ప్రేంసాగర్ రావు అన్నారు. బుధవారం వినాయక చవితిని పురస్కరించుకుని మంచిర్యాల వానవీక్లబ్స్ ఆధ్వర్యం లో స్థానిక వాసవీమెడికల్ అండ్ జనల్ స్టోర్స్ ముందు ఏర్పాటు చేసిన ఉచిత మట్టి వినాయకుల పంపిణీ కార్యక్రమానికి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై 1111 మట్టి వినాయకులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వాసవీక్లబ్స్ గ్రామస్థాయి నుండి అనేక సేవా కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని వైశ్యులతో ఏర్పాటు చేసిన ఈ వాసవీక్లబ్స్ వైశ్యేతరులకు, పేదలకు ముందుగా నిలిచి సేవలు చేయడం అభినందనీయం అన్నారు. మంచిర్యాల వాసవీక్లబ్స్ గత ఇరవై సంవత్సరాలుగా ఇక్కడ పర్యావరణలను రక్షించాలనే లక్ష్యంతో మట్టి వినాయకులను వంపిణీ చేయడం హర్షనీయం అన్నారు..

ఈ కార్యక్రమం లో వాసవీక్లబ్ అంతర్జాతీయ ఉపాధ్యక్షులు కటుకం హరీష్, ముక్తా శ్రీనివాస్, వాసవీక్లబ్ అధ్యక్షుడు కేశెట్టి వంశీకృష్ణ, దాత అంతర్జాతీయ ప్రోగ్రాం కోఆర్డినేటర్ కొండా చంద్రశేఖర్, మరియు పలువురు వాసవీక్లబ్ సభ్యులు, నాయకులు తదితరులు పాల్గొన్నారు..