Anjaneyulu News
Newspaper Banner
Date of Publish : 31 August 2022, 1:31 pm Posted by : Anjaneyulu Dega

ప్రాథమిక జాబితాపై అభ్యంతరాలు ఉంటే తెలియజేయండి

జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి.సుబ్బారాయుడు

మంచిర్యాల జిల్లా: జాతీయ ఆరోగ్య సంస్థ క్రింద బస్తీ దవాఖానాలో 1 స్టాఫ్ నర్స్, 1 సహాయక సిబ్బంది నియామక ప్రక్రియకు సంబంధించిన ప్రాథమిక జాబితా మంచిర్యాల జిల్లా అధికారిరక వెబ్సైట్ www.mancherial.telangana.gov.in లో పొందుపర్చడంతో పాటు జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయ నోటీసు బోర్డుపై ప్రదర్శించడం జరిగిందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డా॥ జి.సుబ్బారాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులకు ప్రాథమిక జాబితాపై ఏవేని అభ్యంతరాలు ఉన్నట్లయితే సెప్టెంబర్ 1 నుండి 3వ తేదీ వరకు సాయంత్రం 5 గం॥ ల లోగా కార్యాలయ పని వేళలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి కార్యాలయంలో వ్రాతపూర్వకంగా తగిన ధృవపత్రాలు జతచేసి సమర్పించాలని, గడువు ముగిసిన పిమ్మట ఫిర్యాదులు పరిగణలోకి తీసుకోబడవని తెలిపారు.