బస్ స్టేషన్ లో ఎమ్మార్పీ ధరలకే వస్తువులు విక్రయించాలి
మంచిర్యాల జిల్లా: జిల్లా కేంద్రంలోని ఆర్టీసీ బస్టాండ్ లో ఉన్న దుకాణాల్లో వస్తువులు ప్రయాణికులకు ఎమ్మార్పీ ధరలకే విక్రయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ సోమవారం తెలంగాణ వినియోగదారుల ఫోరం, డీజేఎఫ్ జర్నలిస్ట్ యూనియన్ ఆధ్వర్యంలో డిపో అసిస్టెంట్ మేనేజర్ కు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా బస్టాండ్ లోని షాపు యజమానులు అధిక ధరలకు వస్తువులు విక్రయిస్తూ ప్రయాణికులను దోచుకుంటున్నారని తెలిపారు. వెంటనే అధికారులు స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, నాణ్యత గల వస్తువుల అమ్మకాలు జరిగేలా...