సీజనల్ వ్యాధులు ప్రబలకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు

మంచిర్యాల జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి మంచిర్యాల జిల్లా: వర్షాకాలం కావడంతో సీజనల్ వ్యాధులు, విషజ్వరాలు ప్రబలే అవకాశం ఉన్నందున సంబంధిత శాఖల సమన్వయంతో ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ భారతి హోళికేరి తెలిపారు. సోమవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలోని జిల్లా కలెక్టర్ చాంబర్ లో జిల్లా అదనపు కలెక్టర్ మధుసూదన్ నాయక్ తో కలిసి మండల ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ.. అంటువ్యాధులు ప్రబలకుండా గ్రామ స్థాయి నుండి పారిశుద్ధ్యంపై...