మనోనేత్రంతో చూస్తాడు.. పనులన్నీ చేస్తాడు..

మోటారును తీయడానికి బావిలోకి దిగుతున్న రాజయ్య ఆంజనేయులు న్యూస్: విశ్వంలో మానవ మేధకు అందని వింతలెన్నో.. మనుషుల్లోనూ విభిన్న సామర్థ్యాలు ఊహకు అందకుండా ఉంటాయి. కంటిచూపులేని వ్యక్తి ఏ సహాయం లేకుండా ఊరంతా తిరగడం, 62 ఏళ్ల వయసులోనూ నీటి బావుల్లోకి దిగి పాడైన మోటార్లను బయటికి తీయడం, వాటికి మరమ్మతులు చేయడం.. తనవంట తాను చేసుకోవడం.. ఇవన్నీ వినడానికి ఆశ్చర్యంగా ఉన్నా.. వాస్తవం కూడా. హనుమకొండ జిల్లా భీమదేవరపల్లి మండలం మాణిక్యాపురం గ్రామానికి చెందిన చింతం రాజయ్య విశేషాలివి. ఆయన ఆరేళ్ల వయసులో...